Tuesday, March 15, 2011

నా ఇరవై రూపాయల నోటు.........

జనవరి ఒకటి రెండువేల పదకొండు,ఎంతో మంది ఎన్నో వేలు కర్చు పెడతారు ఈ రోజు కోసం, కాని ఆ రోజు నాదగ్గరుంది మాత్రం ఇరవై రూపాయలు. ఈ బెంగళూరు మహానగరంలో ఇరవై రూపాయలు కర్చుపెట్టటానికి క్షణం కూడా ఆలోచించనవసరం లేదు, ఈ ఊరిలో ఏమి చేసిన అయిపోతాయి నా దగ్గర వున్న ఈ ఇరవై రూపాయిలు.

ఎప్పట్లాగే ఉదయాన్నే లేచి కాఫీ తాగుదామని నిద్రలేచి చెప్పులేసుకొని అడుగు ముందుకేసాను, వొరేయ్ ఎదవ వుందే ఇరవై ఇప్పుడు కాఫీ తాగావంటే తరువాత అడుక్కుతినాలి ఎదవని ఎదవ, అంటూ ఎవరో తిట్టినట్టుగా అనిపించింది,అయినా అది నిజమే కదా, కాని లేచి కాఫీ తాగటం అలవాటయిపాయే, అప్పుడే బుర్రలో సరికొత్త ఐడియా ఒకటి తట్టింది, లేస్తే కాఫీ కావలి,మళ్లీ వెళ్లి పనుకుంటే అవసరం లేదుగా మనసులో నాకు నేనే "వాట్ యన్ ఐడియా సర్ జీ" అనుకుంటూ వెళ్లి నిద్ర పోయాను. పదికల్లా కడుపు గంట కొట్టటం మొదలెట్టింది. లేచి బ్రష్ చేసి బయలుదేరాలనుకుంటూ ఇక ఇవి కర్చు పెడితే చిల్లి గవ్వ కూడా ఉండదు అనుకుంటూ బయలుదేరా, కిచెన్లోనుంచి ఉప్మా వాసనా గప్పు మంటూ కొట్టింది,కళ్ళు అగరోతుల్లా వెలిగిపోయాయి, ఆహా ఈ రోజు మా వంట మనిషి వచిందని అర్థమయిపోయింది. ఎందుకంటే చెప్పుకోవటానికి ఉందనే కాని వచ్చేది బాగా తక్కువ, మనం గాని అప్పుడప్పుడు కాలేజీకి వెళ్లినట్టు, అంతే వెళ్లి గబా గబా ఉప్మా లాగించ, మాములుగా అయితే ఉప్మా తినేవాళ్ళం కాదుగాని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి గాని రేస్సిషన్ వచ్చినట్టు ఇప్పుడు అనీల్గాడికి కూడా డబ్బులకి బాగా రేస్సిషన్ వచ్చిపడింది మరి, ఎలా అంటారా నాకు రాక రాక వచ్చిన గేటు రాంక్తో M.tech జాయిన్ అయ్యాను బెంగళూరులో, ఇంజనీరింగ్ చేసేప్పుడు ఇలాంటి కాలేజీ లో చేస్తే బావుండేది అని కలలు కనే వాళ్ళం, ఇప్పుడు అంత మంచి కాలేజీ లో చదువుతున్నానన్న సంతోషం పట్టుమని నెల రోజులూ కూడా లేకుండా పోయింది, జాయినవటానికి వచ్చేరోజే ఇంట్లో ఇక నాకు డబ్బులు పంపొద్దు నేను మేనేజ్ చేసుకుంటనని చెప్పా, అక్కడ బెడిసికొట్టింది నాకు, నాకు ప్రతినెల రావలసిన ఎనిమిదివేల రూపాయల స్టయిఫండ్ రాకపోగా, ఇంటికి అడ్వాన్సు అని అదని ఇదని వున్నడబ్బులు మొత్తం పోయిన పదిరోజులకే వూడ్చి పడేసారు, ఇక అప్పట్నుంచి మొదలయింది నాకు రావణకాష్టం.ఏదయితేనే చివరికి ఈ రోజు నాదగ్గర వుంది ఎర్రటి ఇరవై రూపాయలనోటు ఇంకోద్ది రోజులూ నాదగ్గర వుంటే నంబరు కూడా గుర్తుపెట్టుకొనేవాడ్నిసుమీ.


అలాగే మధ్యాన్నం భోజనం కూడా పనిమనిషిని దగ్గరుండి మరీ చేయించాను ఓ పట్టుపట్టాను, అలా మధ్యాన్నం కూడా ఏ డొక లేకుండా పోయింది నా ఇరవై రూపాయలనోటుకి , ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి రాదనే కాని మా పనిమనిషి వచ్చిన రోజు మాత్రం వంటలు గుమగుమలాడిన్చేస్తుంది, అప్పుడయిన తిట్టకుండా ఉంటామని కాబోలు.

ఇక నా కష్టాలన్నీ జిమెయిల్ తో చెప్పుకుంటున్న సమయంలో వచ్చాడు శీనుగాడు, వాడిని చూస్తూనే తిట్టిన తిట్టు మళ్లీ వాడితే బాధపదతాడని కొత్త కొత్త తిట్లు కనిపెట్టి మరీ కష్టపడి తిట్టడం మొదులు పెట్టాను, ఎందుకంటారా మనకెందుకురా పార్టీలు అంటే వినకుండా రాత్రి పార్టీ చేయించాడు ఇప్పుడు ఇద్దరి జేబులు కదిలిస్తే ఇసుక కూడారాలదు నా ఇరవై రూపాయలనోటు తప్ప. ఇలా వాడిని నేను తిట్టటం కొత్త కాదు వాడు పడటం కొత్త కాదు. ఇక తిట్టింది చాలు కాని మాష్టారు బయటికేల్దాంపద అన్నాడు, ఏరా మీ నాన్న గాని బడ్గేట్ రిలీస్ చేసారా ఏంటి కొత్త సంవత్సరం సందర్బంగా అని అడిగాను, భలేఅడిగావే నువ్వు చదివే చదువుకి నీకు బైక్ ఎందుకురా ఇంటికి పంపు కావాలంటే సైకిల్ కొనుక్కొని తిరుగు పెంచిన పోట్టయిన తగ్గుద్ది అని ఉదయాన్నే మంగళహారతి పట్టాడ్ర అన్నాడు, మరి నువ్వేం చేసావ్రా అని అడిగాను, కోతసంవత్సరం రోజు అమంగళం ఎందుకులే అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అన్నాడు, అది సరే మరి బయటికేక్కడికి అంటున్న నన్ను ఆపుతూ వోరై నువ్వు నా ఫ్రెండ్విరా పండగ రోజు నిన్ను ఇంట్లో కూర్చోపెడితే దేవుడు ఈ జన్మకి కాదు కదా జన్మ జన్మలకి నన్ను క్షమించడ్రా అన్నాడు. సోది ఆపి ఎక్కడికో చెప్పు అన్నాను, మంత్రిమాల్కిరా దేవుడు నా జేబునిండా కొనటానికి డబ్బులివ్వకపోయిన బండినిండా పెట్రోలిచ్చాడ్రా పద తియ్యని వేడుకచేసుకున్దాం అన్నాడు, ఇంకా ఏమయినా అంటే కోడతననుకున్నాడేమో సరే సరే కనీసం తిరిగే వేడుక చేసుకుందాం పద అన్నాడు.

ఇద్దరం ఆసియా లోనే పెద్దదయిన మంత్రిమాల్ బయట నిలబడ్డాం, మామ ఇది కట్టాలంటే ఎంత కర్చవుతుంది మామ అని అడిగాడు, రేయ్ నీకు సూట్ అయేమాటలు మాట్లాడ్రా అంటుంటే ఏదో ఒకరోజు ఇలాంటిదొకటి కొని నీకు గిఫ్ట్గా ఇస్తాను అప్పుడు, ఈ దేవుడ్నా నేను ఇన్ని మాటలు అన్నాను అని కుళ్ళి కుళ్ళి...... అంటున్నవాడ్ని ఇక బాధపడతావ్ర ఎందుకు మాట్లాడానా అని అన్నాను, నా ఓపిక గురించే కాదు, నా కోపం గురించి కుడా బాగా తెలుసు కనుక ఇంకేం మాట్లాడలేదు వాడు, ఏదయితేనేం లోపలికెళ్లాం, తళ తళ మెరుస్తున్న గిట్టార్లు ఎదురుగా నవ్వుతూ పలకరించాయి, రేయ్ ఆ గిట్టార్ కొందాం పద అని అన్నాను ఏది నీ దగ్గరున్న ఇరవై రూపాయలతో గిట్టార్ కొంటావ అన్నాడు కాదు నీ బైక్ ఉందిగా అన్నాను, లోపలికి వెళ్తూనే "వాట్ కెన్ ఐ డు ఫర్ యు సర్ " అంటూ ఒకడు అడ్డుపడ్డాడు, "కెన్ ఐ ప్లే థిస్" అనటంతోనే తీసి చేతిలో పెట్టాడు ఆహ అనుకుంటూ మొదలు పెట్టాను వాయించటం మ్యూజిక్ ప్లే అయినట్టుగా అనిపించలేదు అది నన్ను తిట్టినట్టనిపించింది "రేయ్ నీదగ్గర వుంది ఇరవై రూపాయలని మా బాస్కి తెలిసే లోగ ఇక్కడ్నుంచి పారిపో..... పో...... పో......... లేకపోతే మా బాస్ నిన్ను ఆ బోండాం గాడ్నీ ఫ్లూటు వాయించినట్టు వాయిస్తాడు ఉందయం నుంచి సరిగ్గా గిరాకి లేదన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు" అన్నట్టుగా అనిపించింది. ఏంట్రా అలా చూస్తున్నావ్ ఆ గిట్టార్నిఅప్పట్నుంచి అని అడిగాడు శీనుగాడు ఏంలేదు నాకు ఆ గిట్టార్ నచ్చలా అన్నాను, నచ్చిన కొనలేవ్లె అంటూ మెల్లగా గొణిగాడు, అది వినపడిన్దేమో "ఎనీ ప్రాబ్లం సర్" అంటూ దగ్గరకు వచ్చాడు. మామ వినపడిన్దేమోరా ఇప్పుడు కొడతాడ మనల్ని, నా బైక్ ఇచేయ్యాలంటావా అంటూ మొదలుపెట్టాడు, "హవ్ మచ్ ఇట్ కాస్ట్స్" అనటంతో జస్ట్ 8000 రూ సర్ అన్నాడు, మా బట్టలు చూసి నీకు జస్ట్ 8000 అనాలనిపించిన్దేమో మాకు అంత సీన్ లేదు అన్నాను, రేయ్ అంత డైరెక్ట్గా అంటున్నావ్ ఏంట్రా అంటూ టెన్షన్ పడుతున్నాడు, రేయ్ వాడికి తెలుగు రాదు కదరా అనటంతో ఇక మావాడు రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు,ఇక వాడికి తెలిసేలోపు ఇద్దరం అక్కడనుంచి చేక్కేసం, వెకిలిగా మమ్మల్ని చూస్తున్న గిట్టార్ని చూస్తూ ఒకనెల స్టయిఫండ్ చాలు నిన్ను నా సొంతం చేసుకుంట అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాం.

ఇక అలానే అక్కడ వున్న ప్రతిషాప్ ఇంకా గేమ్ సెక్షన్ అన్నీ మమ్మల్ని వెక్కిరించటంతో ఇక విసిగిపోయి ఈ సారి మా స్టయిఫండ్ వచ్చాక ఇక్కడికి వచ్చి, వున్న ప్రతిగేమ్ మీద ఇంకా ఆ గిట్టార్ మీద పగ తీర్చుకుంటామని చివరిగా ఒక మంగమ్మ శబదం విసిరి రూమ్కివచ్చాం.తలుపు తీద్దామని తాళం కోసం చూస్తుంటే చేతిలోకి వచ్చింది ఇరవై రూపాయలనోటు అలా చూస్తుండగానే ఏదో గుర్తొచ్చింది వెంటనే మా కాలేజీ దగ్గరకు వెళ్ళాను సమయం రాత్రి తొమ్మిదయింది ఇంకా ఆ ముసలావిడ అక్కడే వుంది, రోజు కాలేజీ వుంటుంది కదా,కొన్ని డబ్బులు వచ్చేవి వాటితో కడుపునింపుకొనేది కాని అందరి సంతోషం ఆ ముసలావిడ ఆకలికి కారణమైంది.ఒకరి సంతోషం మరొకరి దుఖం అంటే ఇదేనేమో, ఏమయినా తిన్నావా అవ్వ అని అడిగాను లేదు అన్నట్టుగా తలవూపింది ఏమాత్రం ఓపికలేని ఆమె కళ్ళు వున్న ఆకలిని దాచాలేకపోతున్నాయి, వెంటనే ఆ పక్కనే వున్న చిన్న బండి మీద రైస్ పదహారు రూపాయలకి తీసుకొని ఒక రెండు రూపాయలతో నీళ్ళ ప్యాకెట్ తీసుకొని ఇచ్చాను ఎంతో సంతోశంగా తిని అక్కడనుంచి వెళ్లిపోయింది . ఉదయం కాఫీ తాగుంటే నా అలవాటు తీర్చేది, టిఫిన్ చేసుంటే గంటలో కరిగిపోయేది,కాని ఈ రోజు ఈ ఇరవై రూపాయలు ఏదో కొత్త సంతోషాన్నిచ్చింది,అప్పట్నుంచి ప్రతి సెలవురోజు ఒక ఇరవై రూపాయలు నోటు ఒకరి ఆకలిని తీరుస్తూ నాకు కొద్దిపాటి సునకానంధాన్నిస్తుంది........

Friday, April 16, 2010

సినీమాయణం

నేను ఎనిమిదవ తరగతికి హాస్టల్లో జాయిన్ అయ్యాను, మా వార్డెన్ చాల చాల స్ట్రిక్ట్ క్లుప్తంగా చెప్పాలంటే మొహబత్తిఎన్ సినిమాలో అమితాబచ్చన్లా అనుకోండి.అందరికి వార్డెన్ అంటే చచ్చేంత భయం ఎందుకంటే అందరూ తన చేతివాటం రుచిచూసినవాళ్ళే మరి . తప్పుచేసినప్పుడు బిల్డింగ్ పైనుంచి దూకమన్నా దూకేస్తారు కాని పులి బోనులోకి మాత్రం వెళ్లమంటారు అదేనండి వార్డెన్ చంబర్కి వెళ్ళమని అంటారు . మరీ కొంతమందయితే మా వార్డెన్ని చూస్తే చాలు పోసేసుకునేవాళ్ళు ....

ఇక నాగురించి వినండి అప్పుడప్పుడే జాయిన్ అవ్వటంతో రొజూ చదువుతూనే వుండే వాడ్ని అందుకే మా వార్డెన్కి నేనంటే అమితమయిన గురి. ఏదో సాధించేస్తానని, పాపం గొర్రె కసాయి వాడ్ని నమ్మినట్టు మా వార్డెన్ నామీద పిచ్చిగా నమ్మకం పెట్టుకున్నాడు. అప్పుడే నాకు పరిచయమయ్యాడు శీను గాడు, వాడు చదవటం తప్ప హాస్టల్లో ఎన్ని వెధవ పనులు చెయ్యొచ్చో అన్నీ చేస్తూ ప్రశాంతంగా కాలాన్ని వేల్లబుచ్చుకునేవాడు.

ఆ రోజు గురువారం వాడికి నేనే ఎందుకు దోరికేనో గాని ,ఈ రోజు సినిమాకి వెళ్దామ అని అడిగాడు నన్ను , ఈ రోజు మనకి సెలవు కాదుగా ఎలా వెళ్తాం అన్నాను నేను . మనకికాకపోయినా ప్రతిగురువారం వార్డెన్కి సెలవేకద అన్నాడు, అయినా మనల్ని సండే అయితే మాత్రం బయటకుపంపుతాడా ఏంటి లేదుకదా అందుకే అప్పుడప్పుడు మనమే సెలవుతీసుకోవాలి అవసరమయిన మ్యాచ్ కి యువరాజ్ సింగ్ హన్డిచినట్టు అన్నాడు. అప్పుడు వాడు నాకు దాన వీర శూర కర్ణలో NTR గీత చెబుతున్నట్టుగా అనిపించింది ఇక లేట్ చెయ్యలేదు ఇద్దరం కలిసి శివాజి సినిమా (రజని కాంత్ శివాజీ కాదు శ్రీహరి శివాజీ )చూసి మూడో కంటికి తెలియకుండా వచ్చేసాం సినిమా చెత్తగా వున్నా అందరి కళ్ళుకప్పి ముఖ్యంగా మా వార్డెన్ కళ్ళుకప్పి చూసినందుకు ఇప్పటికి గుర్తుండిపోయింది ఆ సినిమా పేరు, ఇక చూడాలి ఆ రోజు నుంచి నేను ఏదో సాధించినట్టు రెండు వేళ్ళు పైకెత్తి తూపాకిలా పెట్టి బాండ్ అనిల్ బాండ్ అనుకునేవాడ్ని , నాకు నేను background మ్యూజిక్ కూడా ఇచ్చుకునే వాడ్ని james బాండ్ ది, అలా వారం రోజులు బాండ్ లానే తిరగాను.

మళ్ళీ గురువారం వచ్చింది కలలో శీనుగాడు రావటంతో ఉలిక్కిపడి లేచాను బయటకూడా శీనుగాడే, ఈ రోజు ఏమవుతుందో అని బయపడ్డాను కాని శీనుగాడిని చూడటంతో boost తాగిని సచిన్లా ఉత్సాహంగా లేచి వెళ్ళిపోయాను. అన్నట్టూ ఆ రోజు ఇంకొకడ్ని తోడుతీసుకునివెళ్ళాం క్రికెట్ మ్యాచ్ fixinglo అజారుద్దిన్ , జడేజా కలిసి మోంగియాని కూడా ఇరికిన్చినట్టు మేము కూడా వాడ్ని ఇరికిస్తామని వాడు ఊహించలేదు పాపం. అప్పట్నుంచి ముగ్గురు కలసి ఎక్కడికి వెళ్లకూడదని
స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాను ఇప్పుడుకూడానండి బాబు ఎందుకంటే ఆ రోజు అనుభవం అలాంటిది మరి.

ఆ రోజు మనోహరం సినిమా చూస్తున్నాం అందులో పోలీసులు జగపతిబబుని కొడుతుంటే నాకనిపించింది ఒకవేళ మా వార్డెన్కి తెలిస్తే నా పరిస్థితి ఇంతే కదా అని, కాని అప్పుడు నాకేం తెలుసు అంతకన్నా దారుణంగా ఉంటుందని , ఎందుకో నాకు మొదట్నుంచి doubtgaane వుంది సుమా . సినిమా అయిపోయింది వెళ్తూ వెళ్తూ కనకదుర్గమ్మకి మొక్కుకొని వెళ్ళాను వార్డెన్కి దొరకకూడదని,కాని కనదుర్గమ్మ కూడా మాకు లాగానే గురువారం సెలవు తీసుకున్ధనుకుంట మా కోరిక పక్కనపెట్టేసింది .

స్కూల్ అయిపోయిన సమయానికి మేము కంపౌండ్ దగ్గరకు వెళ్ళాం. ఎవరు కనిపించక పోవటంతో ఒక్కసారిగా ముగ్గురం జుంప్ చేసాం లోపలికి. రెండో సారి కదా ప్రాక్టిస్ అయిపోయిన్దినాకు బాగా దూకటం , ముగ్గురం పిల్లిలా సగం వొంగి మా హాస్టల్ గోడ పక్కన చప్పుడులేకుండా నడుస్తున్నాం పైన ఎవరో వేపచెట్టు కొమ్మలు నరుకుతున్నట్టు అనిపించింది మెల్లగా పైకి చూసాం అక్కడ ఎవరు చెట్టుని నరకట్లేదు మా వార్డెన్ మాకోసం బెత్తాలు రెడీ చేస్తున్నాడు కుమ్మటానికి మమ్మల్ని. ఆ క్షణం నాకయితే గుండెల్లో ఒకపర్వతం వెయ్యిముక్కలయిన ఫీలింగ్. శీనుగాడికయితే చచ్చి యమలోకంలో వున్న ఫీలింగ్ ఎందుకంటే మా వార్డెన్ దెబ్బలు అనుబవం వుంది వాడికి. అంతే అది చూసిన శీనుగాడు వెనక్కి పరిగెత్తటం మొదలు పెట్టాడు అది ముందే ఊహించిన మా వార్డెన్ కంపౌండ్ దగ్గర నలుగుర్ని పురమాయించాడు మాకోసం. ఇక అక్కడ కట్ చేస్తే మా వార్డెన్ రూమ్లో ........

ముగ్గురం దూరం దూరం నిలబడ్డాం కొట్టేటప్పుడు ఎగరటానికి సౌకర్యంగా ఉంటుందని , ముందు కొత్తగా వచ్చిన కోడిపిల్ల అంటారుగా అల నానుంచే స్టార్ట్ చేసారు అందులోనూ మా వార్డెన్కి నేనంటే అమితమయిన గురి కదా అందుకేఅనుకుంట. నన్ను దగ్గరకు పిలిచాడు వెళ్ళలేదు, నవ్వాడు నాకర్ధం కాలేదు, చేతిలో వున్న బెత్తాలు దూరం విసిరేసాడు నేను మనసులో సంతోషపడ్డాను చేత్తోఅయితే దెబ్బలు పెద్దగాతగలవ్ అని, గుడ్డి కన్నా మెల్ల బెటర్ అనే సామిత గుర్తోచ్చిన్దిలెండి. మళ్ళి నవ్వాడు నేను కాల్గేట్ పేస్టు వాడెవాడ్ని అందుకే పళ్ళు దాచుకోకుండా ఒక పెద్ద స్మైల్ ఇచ్చాను అప్పుడు నాకనిపించింది వార్డెన్ అందరూ అనేంత దుర్మార్గుడు కాదని. మళ్ళీ దగ్గరకు పిలవటంతో ఇదే మంచి సమయం అని వెళ్ళాను అడిగాడు అప్పుడు ఎక్కడేక్కడికి వెళ్లారు నిజం చెప్తే వదిలేస్తనన్నాడు మా వార్డెన్కి నిజం అంటే బాగా ఇష్టమని నమ్మిన నేను ఎవరూ వినకూడదని చేవిధగ్గరకు వెళ్లి చెప్పాను మనోహరం సినిమాకి వెళ్లామని వస్తూ వస్తూ దొరకకూడదని కనకదుర్గమ్మ గుడికి వెళ్లామని చెప్పాను అంతేనా అని అడిగాడు నమ్మకంగా పాపం అంతమంచి మనిషిని మోసం చేయ్యకూడధనిపించింది నాకు, అందుకే ముందు వారం వెళ్ళిన శివాజీ సినిమా గురించికూడా చెప్పి మళ్ళి ఒక కాల్గేట్ స్మైల్ ఇచ్చాను అంతే ఒక్క షాట్తో టేబుల్ కింద ఇరుక్కు పోయాను అప్పుడు ఆలోచించాను కొట్టార లేక ఎవరయినా తోసార నన్ను అని, ఒక్కక్షణంలో తెలిసిపోయింది మా వార్డెన్ నన్ను ఈడ్చికొట్టాడని చంప మండుతున్న మంటవల్ల. మెల్లిగా లేచాను అక్కడినుంచి నేను లేచేలోపే నాకోసం విరుచుకొని వచ్చిన బెత్తాలతో వీపు మీద వాయించేసాడు సరిగ్గా లేచి చూసేసరికి రెండు బెత్తాలు వీరిగిపోయాయి నాకయితే వేసుకున్న చొక్కాని అలాగే వుంచి వీపు మీద ఇస్త్రీ చేసినట్టు వీపంత మండిపోయింది. బాగా ఏడుస్తున్న నన్ను చూసి నాతో వచ్చిన శీనుగాడు, రవిగాడు ఇద్దరు ఏడవటం మొదలుపెట్టారు ఆ పిచ్చకొట్టుడు చూసి, అంతే ఇద్దరు బయటనుంచి వచ్చి నన్ను మోసుకెళ్ళి బయటపడేసారు. లోపల ఏంజరుగుతుందో తెరలేని బొమ్మలా కనపడింది నాకు......


ఆ రోజు మొత్తం మీద నాకు ఒకటి మాత్రం బాగా తెలిసొచ్చింది, ప్రతి గురువారం దుర్గమ్మని disturb చెయ్యకూడదని, అందుకే ఆ రోజు నుంచి ఎప్పుడు సినిమా కెళ్ళిన బాబా గుడికెళ్ళి రావటం మొదలుపెట్టాం.......



మీ అందరి స్పూర్తితో
చెన్నుపాటి అనీల్ కుమార్ చౌదరి