Friday, April 16, 2010

సినీమాయణం

నేను ఎనిమిదవ తరగతికి హాస్టల్లో జాయిన్ అయ్యాను, మా వార్డెన్ చాల చాల స్ట్రిక్ట్ క్లుప్తంగా చెప్పాలంటే మొహబత్తిఎన్ సినిమాలో అమితాబచ్చన్లా అనుకోండి.అందరికి వార్డెన్ అంటే చచ్చేంత భయం ఎందుకంటే అందరూ తన చేతివాటం రుచిచూసినవాళ్ళే మరి . తప్పుచేసినప్పుడు బిల్డింగ్ పైనుంచి దూకమన్నా దూకేస్తారు కాని పులి బోనులోకి మాత్రం వెళ్లమంటారు అదేనండి వార్డెన్ చంబర్కి వెళ్ళమని అంటారు . మరీ కొంతమందయితే మా వార్డెన్ని చూస్తే చాలు పోసేసుకునేవాళ్ళు ....

ఇక నాగురించి వినండి అప్పుడప్పుడే జాయిన్ అవ్వటంతో రొజూ చదువుతూనే వుండే వాడ్ని అందుకే మా వార్డెన్కి నేనంటే అమితమయిన గురి. ఏదో సాధించేస్తానని, పాపం గొర్రె కసాయి వాడ్ని నమ్మినట్టు మా వార్డెన్ నామీద పిచ్చిగా నమ్మకం పెట్టుకున్నాడు. అప్పుడే నాకు పరిచయమయ్యాడు శీను గాడు, వాడు చదవటం తప్ప హాస్టల్లో ఎన్ని వెధవ పనులు చెయ్యొచ్చో అన్నీ చేస్తూ ప్రశాంతంగా కాలాన్ని వేల్లబుచ్చుకునేవాడు.

ఆ రోజు గురువారం వాడికి నేనే ఎందుకు దోరికేనో గాని ,ఈ రోజు సినిమాకి వెళ్దామ అని అడిగాడు నన్ను , ఈ రోజు మనకి సెలవు కాదుగా ఎలా వెళ్తాం అన్నాను నేను . మనకికాకపోయినా ప్రతిగురువారం వార్డెన్కి సెలవేకద అన్నాడు, అయినా మనల్ని సండే అయితే మాత్రం బయటకుపంపుతాడా ఏంటి లేదుకదా అందుకే అప్పుడప్పుడు మనమే సెలవుతీసుకోవాలి అవసరమయిన మ్యాచ్ కి యువరాజ్ సింగ్ హన్డిచినట్టు అన్నాడు. అప్పుడు వాడు నాకు దాన వీర శూర కర్ణలో NTR గీత చెబుతున్నట్టుగా అనిపించింది ఇక లేట్ చెయ్యలేదు ఇద్దరం కలిసి శివాజి సినిమా (రజని కాంత్ శివాజీ కాదు శ్రీహరి శివాజీ )చూసి మూడో కంటికి తెలియకుండా వచ్చేసాం సినిమా చెత్తగా వున్నా అందరి కళ్ళుకప్పి ముఖ్యంగా మా వార్డెన్ కళ్ళుకప్పి చూసినందుకు ఇప్పటికి గుర్తుండిపోయింది ఆ సినిమా పేరు, ఇక చూడాలి ఆ రోజు నుంచి నేను ఏదో సాధించినట్టు రెండు వేళ్ళు పైకెత్తి తూపాకిలా పెట్టి బాండ్ అనిల్ బాండ్ అనుకునేవాడ్ని , నాకు నేను background మ్యూజిక్ కూడా ఇచ్చుకునే వాడ్ని james బాండ్ ది, అలా వారం రోజులు బాండ్ లానే తిరగాను.

మళ్ళీ గురువారం వచ్చింది కలలో శీనుగాడు రావటంతో ఉలిక్కిపడి లేచాను బయటకూడా శీనుగాడే, ఈ రోజు ఏమవుతుందో అని బయపడ్డాను కాని శీనుగాడిని చూడటంతో boost తాగిని సచిన్లా ఉత్సాహంగా లేచి వెళ్ళిపోయాను. అన్నట్టూ ఆ రోజు ఇంకొకడ్ని తోడుతీసుకునివెళ్ళాం క్రికెట్ మ్యాచ్ fixinglo అజారుద్దిన్ , జడేజా కలిసి మోంగియాని కూడా ఇరికిన్చినట్టు మేము కూడా వాడ్ని ఇరికిస్తామని వాడు ఊహించలేదు పాపం. అప్పట్నుంచి ముగ్గురు కలసి ఎక్కడికి వెళ్లకూడదని
స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాను ఇప్పుడుకూడానండి బాబు ఎందుకంటే ఆ రోజు అనుభవం అలాంటిది మరి.

ఆ రోజు మనోహరం సినిమా చూస్తున్నాం అందులో పోలీసులు జగపతిబబుని కొడుతుంటే నాకనిపించింది ఒకవేళ మా వార్డెన్కి తెలిస్తే నా పరిస్థితి ఇంతే కదా అని, కాని అప్పుడు నాకేం తెలుసు అంతకన్నా దారుణంగా ఉంటుందని , ఎందుకో నాకు మొదట్నుంచి doubtgaane వుంది సుమా . సినిమా అయిపోయింది వెళ్తూ వెళ్తూ కనకదుర్గమ్మకి మొక్కుకొని వెళ్ళాను వార్డెన్కి దొరకకూడదని,కాని కనదుర్గమ్మ కూడా మాకు లాగానే గురువారం సెలవు తీసుకున్ధనుకుంట మా కోరిక పక్కనపెట్టేసింది .

స్కూల్ అయిపోయిన సమయానికి మేము కంపౌండ్ దగ్గరకు వెళ్ళాం. ఎవరు కనిపించక పోవటంతో ఒక్కసారిగా ముగ్గురం జుంప్ చేసాం లోపలికి. రెండో సారి కదా ప్రాక్టిస్ అయిపోయిన్దినాకు బాగా దూకటం , ముగ్గురం పిల్లిలా సగం వొంగి మా హాస్టల్ గోడ పక్కన చప్పుడులేకుండా నడుస్తున్నాం పైన ఎవరో వేపచెట్టు కొమ్మలు నరుకుతున్నట్టు అనిపించింది మెల్లగా పైకి చూసాం అక్కడ ఎవరు చెట్టుని నరకట్లేదు మా వార్డెన్ మాకోసం బెత్తాలు రెడీ చేస్తున్నాడు కుమ్మటానికి మమ్మల్ని. ఆ క్షణం నాకయితే గుండెల్లో ఒకపర్వతం వెయ్యిముక్కలయిన ఫీలింగ్. శీనుగాడికయితే చచ్చి యమలోకంలో వున్న ఫీలింగ్ ఎందుకంటే మా వార్డెన్ దెబ్బలు అనుబవం వుంది వాడికి. అంతే అది చూసిన శీనుగాడు వెనక్కి పరిగెత్తటం మొదలు పెట్టాడు అది ముందే ఊహించిన మా వార్డెన్ కంపౌండ్ దగ్గర నలుగుర్ని పురమాయించాడు మాకోసం. ఇక అక్కడ కట్ చేస్తే మా వార్డెన్ రూమ్లో ........

ముగ్గురం దూరం దూరం నిలబడ్డాం కొట్టేటప్పుడు ఎగరటానికి సౌకర్యంగా ఉంటుందని , ముందు కొత్తగా వచ్చిన కోడిపిల్ల అంటారుగా అల నానుంచే స్టార్ట్ చేసారు అందులోనూ మా వార్డెన్కి నేనంటే అమితమయిన గురి కదా అందుకేఅనుకుంట. నన్ను దగ్గరకు పిలిచాడు వెళ్ళలేదు, నవ్వాడు నాకర్ధం కాలేదు, చేతిలో వున్న బెత్తాలు దూరం విసిరేసాడు నేను మనసులో సంతోషపడ్డాను చేత్తోఅయితే దెబ్బలు పెద్దగాతగలవ్ అని, గుడ్డి కన్నా మెల్ల బెటర్ అనే సామిత గుర్తోచ్చిన్దిలెండి. మళ్ళి నవ్వాడు నేను కాల్గేట్ పేస్టు వాడెవాడ్ని అందుకే పళ్ళు దాచుకోకుండా ఒక పెద్ద స్మైల్ ఇచ్చాను అప్పుడు నాకనిపించింది వార్డెన్ అందరూ అనేంత దుర్మార్గుడు కాదని. మళ్ళీ దగ్గరకు పిలవటంతో ఇదే మంచి సమయం అని వెళ్ళాను అడిగాడు అప్పుడు ఎక్కడేక్కడికి వెళ్లారు నిజం చెప్తే వదిలేస్తనన్నాడు మా వార్డెన్కి నిజం అంటే బాగా ఇష్టమని నమ్మిన నేను ఎవరూ వినకూడదని చేవిధగ్గరకు వెళ్లి చెప్పాను మనోహరం సినిమాకి వెళ్లామని వస్తూ వస్తూ దొరకకూడదని కనకదుర్గమ్మ గుడికి వెళ్లామని చెప్పాను అంతేనా అని అడిగాడు నమ్మకంగా పాపం అంతమంచి మనిషిని మోసం చేయ్యకూడధనిపించింది నాకు, అందుకే ముందు వారం వెళ్ళిన శివాజీ సినిమా గురించికూడా చెప్పి మళ్ళి ఒక కాల్గేట్ స్మైల్ ఇచ్చాను అంతే ఒక్క షాట్తో టేబుల్ కింద ఇరుక్కు పోయాను అప్పుడు ఆలోచించాను కొట్టార లేక ఎవరయినా తోసార నన్ను అని, ఒక్కక్షణంలో తెలిసిపోయింది మా వార్డెన్ నన్ను ఈడ్చికొట్టాడని చంప మండుతున్న మంటవల్ల. మెల్లిగా లేచాను అక్కడినుంచి నేను లేచేలోపే నాకోసం విరుచుకొని వచ్చిన బెత్తాలతో వీపు మీద వాయించేసాడు సరిగ్గా లేచి చూసేసరికి రెండు బెత్తాలు వీరిగిపోయాయి నాకయితే వేసుకున్న చొక్కాని అలాగే వుంచి వీపు మీద ఇస్త్రీ చేసినట్టు వీపంత మండిపోయింది. బాగా ఏడుస్తున్న నన్ను చూసి నాతో వచ్చిన శీనుగాడు, రవిగాడు ఇద్దరు ఏడవటం మొదలుపెట్టారు ఆ పిచ్చకొట్టుడు చూసి, అంతే ఇద్దరు బయటనుంచి వచ్చి నన్ను మోసుకెళ్ళి బయటపడేసారు. లోపల ఏంజరుగుతుందో తెరలేని బొమ్మలా కనపడింది నాకు......


ఆ రోజు మొత్తం మీద నాకు ఒకటి మాత్రం బాగా తెలిసొచ్చింది, ప్రతి గురువారం దుర్గమ్మని disturb చెయ్యకూడదని, అందుకే ఆ రోజు నుంచి ఎప్పుడు సినిమా కెళ్ళిన బాబా గుడికెళ్ళి రావటం మొదలుపెట్టాం.......



మీ అందరి స్పూర్తితో
చెన్నుపాటి అనీల్ కుమార్ చౌదరి